Devulapalli venkata krishna sastry biography of abraham



       కోయిలకు పాటనేర్పిన కృష్ణశాస్త్రి


దేవులపల్లి కృష్ణశాస్త్రి


దేవులపల్లి కృష్ణశాస్త్రి (నవంబర్ 1, 1897 - ఫిబ్రవరి 24, 1980) ప్రసిద్ధ తెలుగు కవి.

తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు.

చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది.

1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.



జీవిత విశేషాలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897నవంబరు 1న జన్మించాడు.

అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు.

పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు.

1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.

ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి.

కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు.

1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది.

1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.

తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు.

కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు.

ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు.

పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు.

అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు.

సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశాడు.



1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది.

వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు.

1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు.

1957లో[ఆధారం కోరబడినది] ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.


భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి...

బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు.

ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు.

భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం.

రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.

‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది.

ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు.

ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు.

అందులో ఒకరు ...దేవులపల్లి కృష్ణశాస్త్రి.

గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది.

కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు.

కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.

కృష్ణశాస్త్రి రచనలు

 Krishna Shastri Rachanalu

krishna shastri

ప్రసిద్ధ కవి,రచయిత శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి రచనలను లభించినంత మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.

ఎప్పటిలానే మా ఈ ప్రయత్నమూనూ మీకు నచ్చి తీరుతుందనీ, మళ్ళీ ఎప్పటిలానే మీమీ సాంఘికసంపర్కజాలాల్లో బహుళప్రచారప్రసారాలతో ఈ టపాను ఆదరిస్తారనీ ఆశిస్తున్నాము.

1.దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు 

     (కృష్ణపక్షము,ప్రవాసము,ఊర్వశి)

2. అమృతవీణ (గేయాలు)

3. శర్మిష్ఠ (గేయ/శ్రవ్య నాటికలు)

4.కృష్ణశాస్త్రి బదరిక

5.అరుణరథం

 6.బహుకాల దర్శనం (తదితర నాటికలు)

7. కృష్ణశాస్త్రి గేయసంహిత 2 (మంగళకాహళి)

8. పుష్పలావికలు (తదితర వ్యాసాలు)

9.కృష్ణశాస్తి వ్యాసావళి 1

10.కృష్ణశాస్త్రి వ్యాసావళి - 3

11.కృష్ణశాస్త్రి వ్యాసావళి 4

12.కృష్ణశాస్త్రి పద్యాలు (పల్లకీ)

13. శ్రీవిద్యాపతి (తదితర నాటికలు)

14. ధనుర్దాసు (మొ.

నాటికలు)

15. అప్పుడుపుట్టిఉంటే (మొ.వ్యాసాలు) 




ఆయన పాట మావిచిగురు తిన్న కోయిల పలుకంతా మధురం. కృష్ణవేణి ప్రవాహంలోని గలగలలంత మనోహరం.

ఆయన సాహిత్యం వసంతకాలపు పైరగాలంత స్వచ్ఛం. గంగిగోవుపాలలోని తెలుపంత స్పష్టం. తెలుగు భావ కవితా రంగంలో ఆయనే ఒక ప్రముఖ అధ్యాయం.

భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు 
అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. గొప్ప వక్తగా, 
రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొంది తెలుగు పాటకు కావ్య గౌరవం కల్పించిన వాడు 
దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి.

కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు.

అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది.

పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 

మనసున మల్లెల మాలలూగెనే 
కనుల వెన్నెల డోలలూగెనే 
ఎంత హాయు ఈరేయి నిండెనో -ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో 
అంటే దేవులపల్లి రాసిన తొలి సినిమా పాట.

భావకవిగా, ఆంధ్రా షెల్లీ గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి.. బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి (1951)తో చిత్రరంగంలో అడుగుపెట్టారు.

సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఈ పాటతో ప్రారంభించి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ మెప్పించిన సాహితీ పుష్పాలు. 
మావిచిగురు తినగానే కోయిలా పలికేనా
కోయిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
వసంతకాలం వచ్చిందంటే మోడులన్నీ కొత్త చిగుర్లు వేస్తుంటాయి.

ఆ కొత్తచిగుర్లు తింటూ కోయిల మధురంగా పాటందుకుంటుంది.ఆ పాట కోసమే మావి చిగురు వేసిందేమో అంటాడు దేవులపల్లి సీతామహాలక్ష్మి సినిమాలో.

అంతేకాదు..
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా .. హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తను కోరుకున్నవాడికోసం అడవిలో ఆకులా, పువ్వులా ఉండిపోతానంటూ ప్రేయసి చెప్పే తీరును మేఘసందేశంలో మధురంగా వర్ణించారు దేవులపల్లి.

ఆడపిల్లలకు గోరింటాకు అంటే ఎంతో ఇష్టం. చెట్టునిండా పూసిన గోరింటాకును రుబ్బి చేతికి పెట్టుకుంటే అది పండి ఎర్రని మొగ్గలా ఉంటుందంటూ గోరింటాకు చిత్రంలో చెప్తారాయన.
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగిందీ 
అదే సమయంలో కార్తీకమాసంలో మహిళలంతా దీపాలు వెలికించి పూజలు చేస్తారు.

పౌర్ణమిరోజు దీపాలు వెలిగిస్తే కుటుంబానికంతటికి మంచి జరుగుతుందన్నది వారి విశ్వాసం. వారి నమ్మకానికి మరింత వన్నె తెస్తూ కార్తీకదీపం చిత్రంలో ఆయన రాసిన పాట నాటికి నేటికి ఎవర్‌గ్రీన్ గీతం.
ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్త్రి పాటల్లోని ప్రధాన లక్షణాలు.

ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసినప్పటికి ప్రతి పాట ఒక కావ్యమే. 
రాజమకుటం చిత్రంలో రాజుగా నటించిన ఎన్టీఆర్ అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో ఎలాంటి శబ్దం చేయొద్దనీ, గాలిని కూడా చప్పుడు చేయకంటూ అర్థిస్తాడు.
సడిసేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే సడి సేయకో గాలి..
1969లో వచ్చిన ఏకవీర చిత్రంలో ప్రేయసీ ప్రియుల ప్రణయానికి ప్రతి రాత్రి వసంతమేనంటాడు దేవులపల్లి.
ప్రతిరాత్రి వసంతరాత్రి- ప్రతిగాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి.
1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.
ఇది మల్లెల వేళయనీ -ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ..

విందులు చేసిందీ అంటూ సుఖదుఃఖాలు చిత్రం కోసం విషాద గీతాన్ని రాశారాయన.
తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు.

కానీ ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీ సమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు.

ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. 1929లో విశ్వకవి రవీంద్రనాధ ఠాగూర్‌తో పరిచయం ఏర్పడింది.

Dhimant gandhi biography

వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో అనుంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు.

అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు.

సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఊర్వశి అనే కావ్యం రాశాడు. 

కేవలం భావగీతాలే కాకుండా ఘనాఘానా సుందర అంటూ పలు భక్తి గీతాలు కూడా ఆయన కలం నుంచి రావడం విశేషం.సాహితీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది.

1976లో పద్మ భూషణ్‌తోనూ, 1978లో సాహిత్య అకాడమీ అవార్డుతోనూ ప్రభుత్వం గౌరవించింది.పాటల పూదోటలో ఎన్నో పరిమళాలు పూయించిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది.

కాని అతని రచనా పరంపర కొనసాగింది. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్యానికి తేనేలద్దిన కవి.

ఆయన ప్రతిపాట భావ కవిత్వమే. అందుకే భావ సాహితీరంగంలో ఆయనే ఒక అధ్యాయం. కేవలం కవిగానే కాకుండా సామాజికోద్యమాల్లోనూ తనదైన ముద్రవేసినవాడు.

చిన్న వయసు నుండే రచనలు చేయడం ఆరంభించిన దేవులపల్లి 1929 లో రవీంద్రనాధ ఠాగూర్‌ను కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత మరింత వెల్లివిరిసింది.1945లో ఆకాశవాణిలో చేరి లలితగీతాలు, నాటికలు రాయడం ద్వారా గుర్తింపు పొందారు.

ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. సందర్భానుసారం పాటలు కూడా పాడేవాడు.

అమెరికాలో స్థిరపడినప్పటికీ మన తెలుగు తనాన్ని మరిచిపోలేదని తెలిపేందుకు అమెరికా అమ్మాయి చిత్రంలో కథానాయికతో పాడించిన పాట అటు దేశభక్తిని, ఇటు తెలుగుకీర్తిని ఇనుమడింపజేసేలా సాగింది.
పాడనా తెలుగుపాట పరవశమై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాటఇక ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నపుడు వారి విద్యార్థుల కోసం రాసిన దేశభక్తి గీతం నేటికి జాతీయ పర్వదినాల్లో మార్మోగుతూనే ఉంది.
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!
జయ జయ జయ శత సహస్ర నరనారీ 
హృదయనేత్రి!

కృష్ణశాస్త్రి పుస్తకాల్లో కొన్ని..



ఊర్వశి కావ్యము,
అమృతవీణ - 1992 - గేయమాలిక
అమూల్యాభిప్రాయాలు - వ్యాసావళి
బహుకాల దర్శనం - నాటికలు, కథలు
ధనుర్దాసు - నాలుగు భక్తి నాటికలు,
కృష్ణశాస్త్రి వ్యాసావళి - 4 భాగాలు
మంగళకాహళి - దేశభక్తి గీతాలు
శర్మిష్ఠ - 6 శ్రవ్య (రేడియో) నాటికలు
శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, 
నాటిక 1993
మేఘమాల - సినిమా పాటల సంకలనం 
శ్రీ విద్యావతి - శృంగార నాటికలు
యక్షగానాలు - అతిథిశాల -
సంగీత రూపకాలు
మహాతి
వెండితెర పాటలు - 2008

కృష్ణ పక్షము


ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం.

1920లో వైద్యం కోసం రైలులో బళ్ళారి వెళుతుండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా కృష్ణపక్షం కావ్యం రూపు దిద్దుకొంది.చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి ఆకులో ఆకునై, పూవులో పూవునై అని పలవరించారట.

అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?-నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?
కాలవిహంగమ పక్షముల దేలియాడి-తారకా మణులలో తారనై మెరసి (కృష్ణపక్షము నుండి)

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి